- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే
దిశ, గద్వాల : పట్టణ సమీపంలో ఉన్న సంగాల రిజర్వాయర్ ద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రైతులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేశారు. అదే విధంగా రైతులకు రుణమాఫీ చేశారు. అలాగే రైతుల పండించిన వరి ధాన్యంలో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
గత 6 సంవత్సరం లాగానే సంఘాల చెరువు ద్వారా నీటిని విడుదల చేస్తారు. గద్వాల మండల పరిధిలోని పలు గ్రామాలకు అదేవిధంగా గద్వాల పట్టణానికి కూడా సంఘాల చెరువు నీటిని ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు ప్రతి సన్నకారు రైతులకు సాగునీరు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి రమేష్ నాయుడు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్ మురళి కృష్ణ, శ్రీను, నరహరి గౌడ్, రిజ్వాన్, నాయకులు గోవిందు, కురుమన్న, వంట భాస్కర్, లక్ష్మన్న, దౌలన్న, జగదీశ్వర్ రెడ్డి, గువ్వల గోపాల్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.