70 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు

by Javid Pasha |
70 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఎంత అవగాహన కల్పిస్తున్నా.. తరచూ మోసాలు వెలుగు చూస్తున్నా కొందరు అత్యాశతో సైబర్ మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో పడి హైదరాబాద్ కు చెందిన నలుగురు 70 లక్షలు పోగొట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని వేర్వేరు చోట్ల ఉంటున్న నలుగురికి ఇటీవల వర్క్ ఫ్రమ్ హోం, దండిగా డబ్బు సంపాదించే అవకాశం అంటూ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ ల నుంచి సందేశాలు వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు మేము పంపిన నెంబర్ కి డయల్ చెయ్యండి అంటూ మోసగాళ్లు ఫోన్ నెంబర్లు ఇచ్చారు.

ఇది చూసి నలుగురు వారిని సంప్రదించారు. నెలకు వేలల్లో సంపాదించవచ్చు.. అయితే కొంత డబ్బు డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుందని వీరి నుంచి మోసగాళ్లు 70 లక్షలు గుంజారు. ఆ తరువాత కాంటాక్ట్ లో లేకుండా పోయారు. అప్పుడు మోసపోయినట్టు గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story