పలనక్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం..

by Kalyani |
పలనక్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం..
X

దిశ, దుండిగల్: కుత్భుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ పరిధి ఏలీప్ పారిశ్రామిక వాడ లోని పలనక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ లో బుధకారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆఫీస్ ఫర్నిచర్ తో పాటు ల్యాబ్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సదరు సంస్థకు ఇన్సూరెన్సు లేదు. కనీసం సంస్థకు అనుమతులు తీసుకున్నారా అంటే అక్కడి పరిస్థితులను చూస్తే అనుమానంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story