ఇంధన డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది సజీవ దహనం

by Satheesh |
ఇంధన డిపోలో భారీ అగ్ని ప్రమాదం.. 17 మంది సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజూమున రాజధాని జకార్తాలోని ఓ ఇంధన నిల్వ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ కావడంతో మంటలు నిమిషాల్లోనే పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 17 మంది అగ్నికి సజీవ దహనం కాగా.. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. 52 ఫైరింజన్లతో భారీగా ఎగసిపడుతోన్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story