ఎల్లారెడ్డిలో అగ్ని ప్రమాదం

by Shiva |
ఎల్లారెడ్డిలో అగ్ని ప్రమాదం
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలో అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణ కేంద్రానికి చెందిన జోషి శ్రీధర్ కు చెందిన ఇంటి పైకప్పుపై రేకులను అమరుస్తుండగా షార్ట్ సర్య్కూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంటి వెనక భాగం పూర్తిగా కాలిపోవడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. స్థానికంగా ఉన్న ఫైర్ ఇంజన్ సదుపాయం లేకపోవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. చివరకు మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సహకారంతో మున్సిపల్ వాటర్ ట్యాంక్ తో స్థానికుల సహకారంతో ఇంట్లోని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని నగదు, గృహోపకరణాలు పూర్తి దగ్ధమయ్యాయి.

Advertisement

Next Story