Fire Accident: అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం!

by Shiva |
Fire Accident: అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లకూరు (Pellakuru) మండల పరిధలోని పెన్నేపల్లి (Pennepally)లో ఉన్న స్టీల్ తయారీ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులకు గాయలయ్యాయి. మంటల ధాటికి ఫర్నిచర్ యూనిట్ (Furniture Unit) కాలి బూడిదైంది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో కార్మికులంతా అలర్ట్‌గా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే, ఈ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా యాజమాన్యం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed