- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈత కోసం వెళ్లి తండ్రి కూతుళ్ల మృతి
దిశ, మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన తండ్రి కూతురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐజా మండలం తూముకుంట గ్రామానికి చెందిన రాములు (40) తన కుటుంబంతో కలిసి బంధువుల మామిడి తోటలో పనిచేస్తూ ఉన్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తన కూతురు వెన్నెల (7), కుమారుడికి ఈత నేర్పేందుకు సమీపంలో ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. కుమారుడిని గడ్డ పైన ఉంచి ముందుగా తన కూతురికి ఈత నేర్పించేందుకు బావిలోకి దిగాడు.
ఆ బాలిక భయపడి తండ్రి గొంతు గట్టిగా పట్టుకోవడం... ప్రమాదం నుండి బయటపడేందుకు అవకాశం లేకపోవడం తో తండ్రి కూతురు బావిలో మునిగిపోయారు.. గడ్డమీద ఉన్న బాలుడు తన తండ్రి ,సోదరి నీటిలో మునిగిపోయారు అని అక్కడ ఉన్నవారికి చెప్పారు. అక్కడికి వచ్చి చూసేసరికి నీటిమడుగులో మునిగిపోయినట్లుగా గుర్తించారు.. చేసేది ఏమీ లేక అధికారులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాలను వెలికి తీసేందుకు బావిలో ఉన్న నీటిని మోటార్ల సహాయంతో తోడి వేస్తున్నారు. తండ్రి, కూతురు మరణంతో ఆ కుటుంబంలోనే కాకుండా స్థానిక ప్రజలలోనూ విషాదఛాయలు నెలకొన్నాయి.