ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం..

by Mahesh |   ( Updated:2022-12-17 02:34:22.0  )
ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం..
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ విషాద సంఘటన మందమర్రి మండలం వెంకటాపూర్ లో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన వారు. ఇంటి యజమాని శివయ్య(50) అతని భార్య పద్మ(45) అలాగే పద్మ అక్క కూతురు మౌనిక(23) శాంతయ్య(52) అలాగే మౌనిక ఇద్దరు కుమార్తెలు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు. కాగా అప్పటికే వారంత చనిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read...

కృష్ణా నదిలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి..

Advertisement

Next Story