మెహర్ బాబా ఆశ్రమంలో పేలిన గ్యాస్ సిలిండర్

by Shiva |
మెహర్ బాబా ఆశ్రమంలో పేలిన గ్యాస్ సిలిండర్
X

ఇద్దరికి తీవ్ర గాయాలు

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలోని గుట్టమీద ఉన్న మెహర్ బాబా ఆశ్రమంలో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మెహర్ బాబా భక్తులు పక్క రాష్ట్రాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చి ఒకటి, రెండు రోజులు ఇక్కడే సేదతీరి తిరుగు పయనం అవుతారు. అయితే, మహారాష్ట్ర నుంచి రెండు వాహనాల్లో భక్తులు రావడంతో వారికీ టీ పెట్టే క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. మెహర్ బాబా గుడి దగ్గరలో గాండ్ల సాయిలు (62) వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుంటాడు. మరో వ్యక్తి నితీష్ కుమార్ (26) భజన చేసేందుకు వెళ్తుంటాడని తెలిపారు. అయితే, మెహర్ బాబా భక్తులు రావడంతో వారికి వంట గదిలోకి వెళ్లి టీ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికుల సాయంతో పోలీసులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

Next Story