వెల్పుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ... అడ్డుగా ఉన్న కాల భైరవ విగ్రహం తొలగింపు

by Shiva |   ( Updated:2023-06-07 14:22:33.0  )
వెల్పుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ... అడ్డుగా ఉన్న కాల భైరవ విగ్రహం తొలగింపు
X

దిశ, టేక్మాల్ : గుప్త నిధుల కోసం గుడి వద్ద ఉన్న కాల భైరవ విగ్రహాన్ని తొలగించిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవతల గుట్టలో ఉన్న సొరంగ మార్గానికి కాపలాగా ఉన్న కాల భైరవ విగ్రహాన్ని తవ్వి దుండగులు పక్కన పడేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్పుగొండ గుహలో గుప్త నిధులున్నాయని ప్రచారంలో ఉంది. గతంలో ఈ గృహలో ఉన్న బంగారాన్ని తవ్వడం కోసం అనేక మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. నిధి వేటకు వెళ్లిన వారు ఎవరూ కూడా మళ్లీ తిరిగి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి గుహలోకి వెళ్లేందుకు ఎవరూ కూడా సహాసం చేయలేదు. చాలాకాలం తరవాత తాజాగా మళ్లీ ఇప్పుడు గుప్త నిధుల కోసం ప్రయత్నం జరిగిందని తెలిపారు. కాల భైరవ విగ్రహం తొలగించి ఉండడంతో పక్కా.. ఇది గుప్త నిధుల కోసం చేసిన ప్రయత్నంగానే భావించిన గ్రామస్థులు అంతా కలిసి స్థానిక టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. విచారణ చేపట్టి ఇందుకు కారణమైన దుండగులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story