- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్‌లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఆదివారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది.ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్‌లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఆదివారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది.ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్‌లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఆదివారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది.ఇందులో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమై ఉన్నట్టు అందిన సమాచారంతో 202 బెటాలియన్ కోబ్రా పోలీసులు కూంబింగ్ చేస్తూ అడవిలోకి వెళ్లారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత వీరికి మావోయిస్టులు తారసపడ్డారు. అప్పటికే పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. నక్సలైట్ల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలు కాగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, కాల్పుల్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు కూడా గాయపడినట్లు సమాచారం.