నౌహీరా షేక్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. మొత్తం రూ.400 కోట్లు అటాచ్!

by GSrikanth |
నౌహీరా షేక్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. మొత్తం రూ.400 కోట్లు అటాచ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నౌహీరా షేక్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తాజాగా మరో రూ.33.06 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం హీరా గోల్డ్, నౌహీరా షేక్ కంపెనీలకు సంబంధించిన మొత్తం 24 స్థిరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరుకు ఈ కేసులో మొత్తం ఈడీ రూ.400.06 కోట్లను అటాచ్ మెంట్ చేసింది.

కాగా, అధిక మొత్తంలో తిరిగి చెల్లింపులు చేస్తామని చెప్పి ప్రజల నుంచి నౌహీరా షేక్ రూ.5 వేల కోట్లు వసూలు చేసి వాటిని వివిధ సంస్థల్లోకి మళ్లించారనే ఆరోపణలు నౌహీరా షేర్ ఎదుర్కొంటున్నారు ఈ ఆరోపణలపై 2018లో ఈడీ నౌహీరా సంస్థలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నౌహీరా షేక్‌ను గతంలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కేసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed