- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు బలవన్మరణం
దిశ, భిక్కనూరు : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతన్న బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని ర్యాగట్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆకిటి మల్లారెడ్డి (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొసైటీలో తీసుకున్న రుణాలు కట్టకపోవడంతో సొసైటీ యాజమాన్యం మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయనకు మరో వైపు కుటుంబ పోషణ పెను భారంగా మారడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్నాడు.
దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మల్లారెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మల్లారెడ్డిని కామారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేయాలని ఆదేశించడంతో వారి సలహా మేరకు, కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మల్లారెడ్డి అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు గ్రామస్థలు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.