మెట్ పల్లిలో చిన్నారి పై కుక్కల దాడి..

by Sumithra |
మెట్ పల్లిలో చిన్నారి పై కుక్కల దాడి..
X

దిశ, కోరుట్ల : ఓ చిన్నారి పై కుక్కలు దాడికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబధించిన పూర్తివివరాల్లోకెళితే మెట్ పల్లి పట్టణంలోని ఎస్సారెస్పి కెనాల్ కట్ట మజీద్ దగ్గర మాహామ్మద్ ఉమర్ (9) అనే బాలడు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో బాలుడి చేయ్యి, శరీరం పై పలు గాయలయ్యాయి. స్థానికులు బాలున్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఇప్పటి వరకు చాలా మంది పై కుక్కలు దాడికి పాల్పడ్డాయని స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story