- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bike Ride: బైక్ రైడ్ క్యాన్సిల్.. డాక్టర్ కు వీడియోలు పంపి నరకం చూపించిన రైడర్
దిశ, వెబ్ డెస్క్: ఆఫీస్ కు వెళ్లాలి. టైమ్ తక్కువ ఉంది. బస్సులో వెళ్లాలంటే లేట్ అయిపోతుంది. అలాంటి సమయాల్లోనే చాలా మంది బైక్ రైడ్ ను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆఫీస్ నుంచో, ఏ పార్టీ నుంచో లేట్ నైట్ ఇంటికెళ్లాల్సి వస్తే.. ఎక్కడో ఉన్న బస్టాప్ కు వెళ్లే బదులు బైక్, క్యాబ్ రైడ్ బుక్ చేసుకుంటే త్వరగా వెళ్లిపోతారు. ఓ డాక్టర్ కూడా ఇలా ఆలోచించే.. బైక్ రైడ్ ను బుక్ చేసుకుంది. అయితే అతను రావడానికి ఎక్కువ టైం పడుతుండటంతో క్యాన్సిల్ చేసింది. అంతే.. తనలో ఉన్న క్రూరుడిని చూపించాడు ఆ రైడర్. రైడ్ క్యాన్సిల్ చేశాక ఆమెకు 17 సార్లు ఫోన్ కాల్స్ చేయడమే కాకుండా.. వాట్సాప్ (Whatsapp) కు అసభ్యకరమైన వీడియోలు పంపించాడు. ఈ ఘటన కోల్ కతాలో (Kolkata) జరిగింది.
నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తోన్న మహిళ.. విధులు పూర్తిచేసుకుని ఇంటికెళ్లేందుకు బైక్ రైడ్ బుక్ చేసింది. రైడర్ ఆలస్యంగా వస్తుండటంతో క్యాన్సిల్ చేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన రైడర్ ఆమెను వేధించాడు. 17 కాల్స్, అసభ్య వీడియోలు పంపి.. నువ్వు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటావని హెచ్చరించాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. తొలుత ఆన్లైన్ లో పోలీస్ కమిషనరేట్ కు ఫిర్యాదు చేసిన ఆమె.. ఆ తర్వాత పుర్బా జాదవ్ పుర్ పీఎస్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.