- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Accident : డీసీఎం, బైక్ ఢీ.. ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం..
దిశ, కోదాడ : డీసీఎం బైకు ఢీ కొని ఒకరు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన నేరేడు సైదులు (40) మృతి చెందగా గూడపు పుల్లయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. కోదాడ పట్టణంలో పని ముగించుకొని తన స్వగ్రామం గణపవరానికి ద్విచక్ర వాహనం పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎదురుగా మేళ్ల చెరువు వైపు నుండి కోదాడ వైపు వస్తున్న డీసీఎం ఢీ కొట్టడంతో సైదులు అక్కడక్కడ మృతి చెందాడు.
పుల్లయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఓ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య వీర కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ సైదులు తెలిపారు. గుడిబండ రోడ్లో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలలో రోడ్డుకు ఇరువైపు లారీలు నిలిపి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.