ఫాంహౌస్​లపై ఎస్వోటీ దాడులు.. పలువురి అరెస్ట్​

by Javid Pasha |
ఫాంహౌస్​లపై ఎస్వోటీ దాడులు.. పలువురి అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సైబరాబాద్ ​ఎస్వోటీ పోలీసులు శనివారం రాత్రి హైదరాబాద్​ శివార్లలోని పలు ఫాంహౌస్ లు, లాడ్జీలు, పబ్బులు, ఓయో హోటళ్లు, దాబాలపై మెరుపుదాడులు జరిపారు. తనిఖీల్లో అనుమతి లేకుండా మద్యం తాగటానికి, గంజాయి పీల్చటానికి అనుమతించిన ఫాంహౌస్ లు, లాడ్జీలు, పబ్బులు, ఓయో హోటళ్ల యజమానులు, ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరితోపాటు మద్యం సేవిస్తున్నవారిని, గంజాయి తాగుతున్న వారితోపాటు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కూడా కటకటాల వెనక్కి పంపించారు.

పేట్​బషీరాబాద్​పోలీస్​స్టేషన్​పరిధిలోని లక్షీ విల్లా గెస్ట్​హౌస్, కేపీహెచ్బీ స్టేషన్​పరిధిలోని హోటల్​కాకతీయ రెసిడెన్సీ, షామీర్​పేట స్టేషన్​పరిధిలోని జాస్మిన్​ఫాంహౌస్ లపై దాడులు చేసి గంజాయి, మద్యం తాగుతున్న వారిని పట్టుకున్నారు. ఇక, శంషాబాద్​స్టేషన్​పరిధిలోని అక్రియేషన్​ఫాంహౌస్, మొయినాబాద్​స్టేషన్​పరిధిలోని బ్రౌన్​టౌన్​రిసార్టులోని మ్యాంగో ఉడ్​ఫాంహౌస్​పై దాడి చేసి ముజ్రా చేస్తున్న యువతులతోపాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. ఇదే స్టేషన్​పరిధిలోని ఖుషీ కర్తే మ్యాంగో ఉడ్​ఫాంపై దాడి చేసి హుక్కా, మద్యం సేవిస్తున్న వారిని పట్టుకున్నారు.

Advertisement

Next Story