ఎస్సైని కూడా వదలని సైబర్ దొంగలు..

by Sumithra |
ఎస్సైని కూడా వదలని సైబర్ దొంగలు..
X

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల ఎస్సై కిరణ్ కుమార్ ప్రజలకు సైబర్ అలర్ట్ జారీ చేశారు. తన పేరు, ఫోటో వాడుకొని ఎవరో ఇంస్టాగ్రాంలో ఫేక్ ఐడీలతో మోసాలు చేస్తున్నారని వాట్సాప్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ వాట్సాప్ స్టేటస్ లో నా పేరు ఫోటో వాడుకొని డబ్బులు పంపాలని మెసేజ్ లు పంపుతున్నారని, ఆ మెసేజ్ కు ఎవరు స్పందించవద్దని తెలిపారు. ఆ చాటింగ్ లో రూ.6500 త్వరగా పంపాలని రెండు గంటల్లో మళ్లీ రిటర్న్ చేస్తానని ఈ ఫోన్ నెంబర్ కు 9812626937 కు గూగుల్ పే ద్వారా పంపాలని సందేశాన్ని పంపారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed