- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్డింగ్‌పై నుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతి..ప్రాణం ఖరీదు రూ. 15 లక్షలు
దిశ, శేరిలింగంపల్లి : మనిషి ప్రాణానికి విలువ కట్టలేం. అది ఎవరైనా కావచ్చు. కానీ ఓ బిల్డర్ మనిషి ప్రాణానికి విలువ కట్టేశారు. అది కేవలం రూ.15 లక్షలు. అవును మీరు చదివేది నిజమే. ఓ భవన నిర్మాణ కార్మికుడు పని చేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతే ఆయన ప్రాణానికి కట్టిన విలువ ఇది. అసలు విషయానికి వస్తే.. మియాపూర్ డివిజన్ మయూరి నగర్ లో ఆర్ ఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ ప్రోప్రైటర్ రామాయణం నరేష్ బాబు.. బొర్ర పూజకు చెందిన మయూరి నగర్ లోగల సర్వే నెంబర్ 20, 28/1 లోని ఎంఐజీ ప్లాట్ నెంబర్ 465 లో గల 216 గజాల స్థలాన్ని డెవలప్మెంట్ కు తీసుకుని స్టిల్ట్ ప్లస్ 4 అంతస్థుల నిర్మాణం చేపట్టాడు. గత కొన్నాళ్లుగా అక్కడ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ నిర్మాణం వద్ద మహబూబ్ నగర్, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సోమవారం ఈ నిర్మాణం వద్ద క్రేన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదగిరి (45) క్రేన్ వైర్ తెగిపడి 4వ అంతస్తు నుంచి కింద ఉన్న ఇటుకల మీద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రాణం విలువ రూ.15 లక్షలు..
నిర్మాణంలో ఉన్న భవనం వద్ద క్రేన్ ఆపరేట్ చేస్తూ చనిపోయిన మృతుడి ప్రాణానికి ఆర్ ఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రొప్రైటర్ నరేష్ ఖరీదు కట్టారు. కన్స్ట్రక్షన్ Constructionజరుగుతున్న బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి పడిపోయి మృతిచెందినందుకు గాను రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని అంగీకరించారని మృతుని బంధువులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ (Mahbub Nagar ) నుండి కుటుంబంతో కలిసి నగరానికి వలవసవచ్చి పిల్లా పాపలను కంటికి రెప్పలా కాపాడతాడు అనుకుంటే కాటికి వెళ్లాడు అంటూ యాదగిరి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రూ.15లక్షలతో మేమేం చేసుకోవాలని, ఆయన అంగవైకల్యంతో మా కళ్ల ముందున్న బాగుండేదని, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటూ ఏడ్చిన కుటుంబ సభ్యుల ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానం లేకుండా పోయింది. బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందిన ఘటనకు సంబంధించి మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల అలసత్వం.. నిర్మాణదారుల ఇష్టారాజ్యం
బహుళ అంతస్థుల నిర్మాణాల వెనుక అనేక విషయాలను దాచేస్తున్నారు కొందరు రియల్టర్లు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా, సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే సెల్లార్ల కోసం వందల ఫీట్ల లోతుకు తవ్వేస్తూ అంతస్థుల మీద అంతస్తులు కట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తీరా ఏదైనా ప్రమాదం జరగగానే తమ తప్పేమీ లేదని, మరొకరి మీదకు నెట్టేస్తున్నారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. మాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, మాకూ ఈ ఎంపీ తెలుసు.. అధికారులను అందరిని మేనేజ్ చేశాం. ప్రాణం ఖరీదు కట్టేశాం.. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ దబాయింపులకు దిగుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో ఇటీవల ఆయా నిర్మాణాల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికులు లేదా సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాలకు గురవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై అధికారుల్లోనూ స్పందన లేదు. అంతా వాళ్లే చూసుకుంటారులే అని లైట్ తీసుకుంటున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.