Minor Maid: 15 ఏళ్ల పనిమనిషి దారుణహత్య.. హాట్ ఐరన్ రాడ్డుతో కొట్టి.. సిగరెట్ తో కాల్చి..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-03 02:52:19.0  )
Minor Maid: 15 ఏళ్ల పనిమనిషి దారుణహత్య.. హాట్ ఐరన్ రాడ్డుతో కొట్టి.. సిగరెట్ తో కాల్చి..
X

దిశ, వెబ్ డెస్క్: చదువుకోవాల్సిన వయసులో పిల్లలు పనులు చేస్తున్నారు. అది వారి కుటుంబ పరిస్థితి వల్ల కావచ్చు.. మరేదైనా కావొచ్చు. చైల్డ్ లేబర్ (child labour) చట్టరీత్యా నేరమని తెలిసినా.. కొందరు పిల్లలతో పనులు చేయించుకోవడమే కాకుండా.. వారిని నానా హింసలకు గురిచేస్తున్నారు. చెన్నైలో (Chennai maid Murder) 15 ఏళ్ల బాలికను చిత్రహింసలు చేసి చంపారు దంపతులు. ఆపై బాలిక మృతదేహాన్ని టాయిలెట్ లో పడేశారు. ఈ ఘటన చెన్నైలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమింజికరై (Aminjikarai) ప్రాంతంలోని మెహతానగర్లో ఒక ఫ్లాట్ లో బాలిక పనిచేస్తోంది. ఆమె తండ్రి చనిపోవడంతో.. పనులు చేస్తూ తల్లికి సహాయంగా ఉంటోంది. మహ్మద్ నిషాద్ - నసియా ఇంట్లో పనిచేస్తున్న బాలికను వాళ్లు చిత్రహింసలకు గురిచేశారు. వేడి ఐరన్ రాడ్డుతో కొట్టి.. సిగరెట్లతో కాల్చి నరకం చూపించారు. గాయాలను తట్టుకోలేక బాలిక మృతిచెందడంతో.. మృతదేహాన్ని టాయిలెట్ లో వదిలేసి, తమ సోదరి ఇంటికి పరారయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిల్ పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (kilpauk medical college hospital) కు తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా ? అన్నది పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితులైన దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. బాలికను అంత చిత్రహింసలకు గురిచేసి మరీ చంపడానికి కారణాలేంటి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story