కోరమండల్ లోకోపైలట్ మృతి

by Javid Pasha |
కోరమండల్ లోకోపైలట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 2న ఒడిశాలోని బాలాసోర్ లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను కోరమండల్ రైలు ఢీకొనడంతో దాదాపు 290 మంది ప్రయాణికులు చనిపోగా.. 900 మంది వరకు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ (డ్రైవర్) మహంతి మరణించారు. భువనేశ్వర్ ఆపుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే చనిపోయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి లోకో పైలట్ కు ఎలాంటి సంబంధం లేదని , సిగ్నల్స్ లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story