- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశృతి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు మృతి
దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కరెంటు షాక్‌తో మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ నగరంలో చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి 10.30 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. కార్యకర్తలు ఇంటికి వెళ్లున్న సమయంలో గందరగోళం నెలకొని.. వాళ్ల వాహనంలో ఒకటి కదలకుండా మొరాయించింది. దీంతో వారిలో కొందరు దానిని నెట్టడం ప్రారంభించారు.
అప్పుడు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఏడుగురికి వాహనంపై అమర్చిన ఇనుప జెండా స్తంభం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. వారిని ముంబైలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మీరా భయందర్-వసాయి విరార్ పోలీసు కమిషనరేట్ సీనియర్ ఆఫీసర్ తెలిపారు.