అడవిలో కారు దగ్ధం..

by Kalyani |
అడవిలో కారు దగ్ధం..
X

దిశ, చౌదరిగూడ: జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచేర్ల శివారులో గల అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం కారుకు నిప్పంటించి దగ్ధం చేశారు. అడవిలో వాచెర్ గా పనిచేస్తున్న అజహార్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా రాచకాల్వ దగ్గర కల్వర్టు పక్కన గుర్తు తెలియని కారు కాలిపోతుండడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వెంటనే చౌదరిగూడ మండల ఎస్సై సక్రం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అప్పటికే ఆ కారు గుర్తు పట్టకుండా పూర్తిగా తగలబడిపోయింది. కారు లోపల చుట్టుపక్కన ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని చూడగా ఎవరు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కారును దగ్ధం చేసి ఉంటారని ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story