రామాయంపేటలో కారు బీభత్సం

by Shiva |
రామాయంపేటలో కారు బీభత్సం
X

మహిళ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

దిశ, చిన్నశంకరంపేట : రామాయంపేట పట్టణంలో ఆదివారం చిరు వ్యాపారుల పైకి కారు దూసుకుపోవడంతో ఓ మహిళ స్పాట్ లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. రోజు మాదిరిగా స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులు పండ్లు అమ్ము కుంటున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా ఓ కారు వారి పైకి అనూహ్యంగా దూసుకురావడంతో డి.ధర్మారం గ్రామానికి చెందిన పున్న రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. అదేవిధంగా పట్టణానికి చెందిన జలగడుగుల సత్యం కాళ్లపై నుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. బిక్కనూర్ మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన కొఠారి గంగమని, రింకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story