- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులిచ్చిన మాజీ భార్య సంతోషంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక..
దిశ, వెబ్ డెస్క్: ప్రేమ పెళ్లి.. అన్యోన్య కాపురం 15 ఏళ్ల కొడుకు అంతలోనే ఆ కుటుంబంలో మద్యం కారణంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే వేరే వ్యక్తితో తన మాజీ భార్య సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక భార్యను భర్త కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కురుగుంటలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వజ్రకరూరుకు చెందిన తపాల్ బాబా, పెనకచర్ల గ్రామానికి చెందిన లక్ష్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 15 ఏళ్ల కుమారుడు నూర్ మహమ్మద్ వలీ ఉన్నాడు. భార్య పేరును ఆషాబీగా మార్చారు. మద్యానికి బానిసైన భర్త బాబా తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అనంతరం భార్య ఆషాబీ నబీల్ రసూల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
కాగా నబీల్ రసూల్ కు ఇది వరకే పెళ్లి కాగా రెండో భార్యగా కొనసాగుతోంది. ఇటీవల ఆషాబీకి కురుగుంటలో ఇల్లు మంజూరు కావడంతో నబీరసూల్ దగ్గరుండి ఇంటి నిర్మాణం పూర్తి చేయించాడు. అనంతరం కొత్త ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కళ్లెదుటే భార్య సంతోషంగా తిరగడాన్ని చూసి తట్టుకోలేక బాబా ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో ఆషాబీ అక్కడికక్కడే మృతి చెందింది. ఆషాబీ సోదరుడు రమేష్‌పై కూడా దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.