బ‌ర్త్ డే పార్టీకి పిలిచి విచ‌క్ష‌ణ ర‌హితంగా యువ‌కుడిపై దాడి

by Kalyani |
బ‌ర్త్ డే పార్టీకి పిలిచి విచ‌క్ష‌ణ ర‌హితంగా యువ‌కుడిపై దాడి
X

దిశ, గండిపేట్ : పథకం ప్రకారం యువకుడిని బర్త్ డే పార్టీకి పిలిపించి యువకుడిపై స్నేహితులే విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో యువకుడు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న నార్సింగి పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడిపిఎల్ ప్రాంతానికి చెందిన రోహిత్ త‌న స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజును పురస్కరించుకొని అలకాపురి కాలనీకి వచ్చాడు. కాగా బర్త్ డే వేడుకలో రోహిత్ కు తీవ్రంగా మద్యం తాగించారు. అనంతరం రోహిత్ ను రోడ్ నెంబర్ 30 వద్ద అతని స్నేహితులే చితకబాదారు. తలపై మద్యం సీసాతో మోదారు. దీంతో తీవ్ర గాయాలకు గురైన రోహిత్ కుప్పకూలిపోయాడు. విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్బర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు మరో యువకుడిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నట్లు వినికిడి. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.


Advertisement

Next Story