చిరుత దాడిలో లేగదూడ మృతి

by Shiva |
చిరుత దాడిలో లేగదూడ మృతి
X

దిశ, లింగంపేట్ (నాగిరెడ్డిపేట్) : మండల కేంద్రంలోని పెద్ద వాగు సమీపంలో గ్రామానికి చెందిన ఆవుల మనోహర్ కు చెందిన లేగ దూడపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు మనోహర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆవుల మనోహర్ కు పెద్ద వాగు సమీపంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న తన బోరు బావి వద్ద రోజు వారీగా పశువులను అక్కడే కొట్టంలో కట్టేసేవాడు. రోజు లాగానే ఆదివారం కూడా సాయంత్రం పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి వచ్చారు.

'తెల్లవారుజామున పొలం వద్ద ఉన్న కొట్టంలో చూడగా లేగదూడ చనిపోయి ఉంది. దీంతో రైతు మనోహర్ స్థానికులకు, అటవీ శాఖ అధికారులకు, పశువైద్యాధికారులకు సమాచారం అందజేశాడు. పశువుల కొట్టంలో చాలా పశువులు ఉన్నా చిరుత కేవలం లేగదూడపై దాడి చేసిందన్నారు. మృతి చెందిన దూడకు పశు వైద్యాధికారులు పంచనామ నిర్వహించారు. చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. దీంతో పెద్దవాగు సమీపంలోకి వెళ్లాలంటేనే రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు జంకుతున్నారు.

Advertisement

Next Story