Brutal Murder: రాష్ట్రంలో మరో సంచలనం.. భార్య, కుమారుడిని చంపి వ్యక్తి బలవన్మరణం

by Shiva |
Brutal Murder: రాష్ట్రంలో మరో సంచలనం.. భార్య, కుమారుడిని చంపి వ్యక్తి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున సంచలన ఘటన చోటుచేసుకుంది. బేగంబజార్‌ (Begam Bazar)లో జంట హత్యలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం నుంచి సిరాజ్ (Siraj) కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున భార్యను సిరాజ్ (Siraj) కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం చిన్న కుమారుడిని గొంతునులిమి ప్రాణాలు తీశాడు. ఆ రెండు హత్యలను కళ్లారా చూసిన పెద్ద కుమారుడు భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. జంట హత్యల తరువాత సిరాజ్ (Siraj) సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని బలవన్మరాణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police), క్లూస్ టీం (Clues Team) ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Next Story