ఉరి తాడుగా మారిన ఉయ్యాల..

by Mahesh |
ఉరి తాడుగా మారిన ఉయ్యాల..
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమకొండ జిల్లా దామెర మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉయ్యాలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దామెర మండలంలోని ఊరుగొండ గ్రామంలో ఉయ్యాలపై ఆడుకుంటున్న బాలుడు మృతి చెందాడు. ఉయ్యాల ఊగుతుండగా.. తాడు బాలుని మేడకు బిగుసుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. స్థానికులు నుంచి వివరాలు సేకరించుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story