లింగం బావిలో పడి బాలుడి మృతి..!

by Kalyani |
లింగం బావిలో పడి బాలుడి మృతి..!
X

దిశ, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న లింగంబావిలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని తెలుగుపేట కాలనీకి చెందిన అరవింద్ (9) మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కాలనీలో ఉన్న స్నేహితులతో కలిసి లింగం బావికి ఈతకు వెళ్లారు. అరవింద్ కు ఈత రాకపోవడంతో తన స్నేహితులు అరవింద్ ను బావి గడ్డపైనే ఉంచి ఈత కొడుతున్నట్లు సమాచారం.

బావి గడ్డపై ఉన్న అరవింద్ ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా తనకు ఈత వచ్చానే నెపంతో బావిలోకి దూకినాడా.. అనే విషయం ఎవరికీ అంత చిక్కడం లేదు. తన స్నేహితులంతా ఈత కొట్టిన తర్వాత కాలనీకి తిరిగి వెళ్లారు. కాలనీలో తమ కుమారుడు ఎక్కడ అని అరవింద్ తల్లిదండ్రులు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అరవింద్ స్నేహితులు ఉదయం తమ వెంట వచ్చాడని తిరిగి రాలేదని చెప్పడంతో రాత్రి కాలనీవాసులతో పాటు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చి లింగం బావి దగ్గరికి చేరుకొని అరవింద్ మృతదేహం బావిలో నుంచి బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story