చౌటుప్పల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Sumithra |
చౌటుప్పల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలోని తుర్కగూడెం రోడ్డులో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని చౌటుప్పల్ పోలీసులు కనుగొన్నారు. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి దండు మల్కాపురం గ్రామ శివారు తుర్కగూడెం రోడ్డులో సుమారు 60 నుంచి 65 ఏళ్ల వయస్సున్న ఓ అజ్ఞాత వ్యక్తి రోడ్డు పక్కన నిర్జీవంగా పడిఉన్నాడని బాటసారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతుడు భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలతో ఫిట్స్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలవల్ల మరణించి ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపారు.

Advertisement

Next Story