- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bike theft : చుక్కాపూర్ లో పట్టపగలే బైక్ చోరీ
దిశ, తలకొండపల్లి : మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో ఆమనగల్ నుంచి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఆపి ఉన్న బైకును దొంగలు (Bike theft)ఎత్తుకెళ్లారు. బాధితుడు కాలూరి రామచంద్రయ్య (Kaluri Ramachandraiah)కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డు పక్కనే ఏసీ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తున్న రామచంద్రయ్య అక్కడే తన బైక్ను నిలిపారు. అదే సమయంలో దొంగలు మరో పాత ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ వాహనాన్ని అక్కడ ఆపి రామచంద్రయ్య బైక్ను తీసుకొని వెళ్లారు. దాంతో బాధితుడు తలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడ వదిలిన పాత బైక్ కూడా చోరీ చేసిందేనని పోలీసులు గుర్తించారు. కాగా చుక్కాపూర్ గ్రామంలో ఈనెల 3న రాత్రి సమయంలో పడమటి తండా కు సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో హుండీ పగలగొట్టి చోరీ జరిగి నెల రోజులు కాకముందే మరో చోరీ చోటుచేసుకుంది. అదేవిధంగా ఆగస్టు 24న రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి ఏకంగా తొమ్మిది ట్రాక్టర్ల బ్యాటరీలు, రెండు టిప్పర్ బాటరీలు దర్జాగా దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఏది ఏమైనా చుక్కాపూర్ గ్రామంలో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు, మహిళలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేసి దొంగలను పట్టుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.