- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భోపాల్ లో భారీ అగ్ని ప్రమాదం.. 12 వేల కీలక ప్రభుత్వ ఫైళ్లు దగ్ధం..!
భోపాల్: భోపాల్ లోని ఆరు అంతస్తుల సత్పురా భవన్ లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన ఫర్నీచర్, 12 వేలకు పైగా రాష్ట్ర ఫైళ్లు, కొవిడ్ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు దగ్ధమయ్యాయి. సత్పురా భవన్ లో అనేక ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. మూడో అంతస్తులో ప్రారంభమైన అగ్ని కీలలు నాలుగు, ఐదు, ఆరో అంతస్తుకు కూడా వ్యాపించాయి. 2012, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సత్పురా భవన్ లో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
అగ్ని ప్రమాదం ఎలా మొదలైంది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనంలోని మూడో అంతస్తులో గల గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. ఆర్మీకి చెందిన పలు ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది 12 గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎయిర్ కండిషనర్ లో పేలుడు సంభవించి మంటలు చేలరేగి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. అయితే.. అధికారులు దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
ప్రమాదంపై విచారణకు కమిటీ
అగ్ని ప్రమాదం వెనుక బీజేపీ ప్రభుత్వ కుట్ర ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే.. కీలకమైన ఫైళ్లేవీ ధ్వంసం కాలేదని మధ్యప్రదేశ్ సర్కారు తెలిపింది. సత్పురా భవన్ లోని ఆరు అంతస్తుల్లో గిరిజన వ్యవహారాలు, ఆరోగ్యం, అటవీ, ముఖ్యమంత్రి పర్యవేక్షణ, ప్రజా ఫిర్యాదులు, జాతీయ సమాచార వ్యవస్థ తదితర శాఖలు పనిచేస్తాయి. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భవనంలోని నాలుగు అంతస్తుల్లోని ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, ఫిర్యాదు పత్రాలు, బడ్జెట్ అకౌంటింగ్ పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఫిర్యాదుల శాఖలో నమోదైన ఫిర్యాదుల ఫైళ్లు, కొవిడ్ మహమ్మారి సమయంలో ఆస్పత్రులకు చేసిన చెల్లింపుల పత్రాలు కూడా దగ్ధమయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నర్సింగ్, ఫిర్యాదులు, ఖాతాలు, కమిషన్ శాఖ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలు, విధానసభ పత్రాలు దెబ్బతిన్నాయి. రెండో అంతస్తులో పనిచేస్తున్న ఆస్పత్రి పరిపాలన శాఖకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండో అంతస్తులో ఉన్న ఆస్పత్రులకు సంబంధించిన మందులు, పరికరాలు, ఫర్నీచర్, టెండర్ ఫైల్స్ సురక్షితంగా ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీ విచారణ చేపట్టి ముఖ్యమంత్రికి నివేదికను అందజేస్తుంది.