రూ.22 లక్షల విలువైన ఎర్రచందనం, వాహనాలు స్వాధీనం

by Javid Pasha |
రూ.22 లక్షల విలువైన ఎర్రచందనం, వాహనాలు స్వాధీనం
X

దిశ, భాకరాపేట: తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఆదేశాలమేరకు అక్రమ రవాణాపై జిల్లాలో ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో భాకరాపేట సీఐ తులసీరాం ఎస్ఐ ప్రకాష్ కుమార్ పోలీస్ సిబ్బందితో శనివారం ఉదయం ఐదు గంటలకు భూతం వారిపల్లి బస్ స్టాప్ దగ్గర రెండువాహనాలు ఆగి ఉన్న క్రమంలో కొంతమంది ఉండడంతో అనుమానంతో వారిని చుట్టుముట్టి వారిని పట్టుకోగా అందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించడం జరిగిందని సీఐ చెప్పారు. వాహనాలలో తనిఖీలు చేపట్టగా ఒకవాహనంలో రంపాలు, గొడ్డళ్లు ఉండడంతో మరో వాహనంలో ఎర్రచందనం దుంగలను గుర్తించామని అన్నారు.

వారందరిని విచారించగా తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన తాంజి అనే బడా ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడు తున్నాడని అన్నారు. బడా స్మగ్లర్ తాంజి అతని డ్రైవర్ అక్కడినుండి పరార్ అయినట్లు తెలిపారు. తాంజి అనే బడా స్మగ్లర్ పై తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలలో సమారు 30 ఎర్రచందనం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. తాంజిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వాహనాలు, ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ. 22లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఎనిమిదిమంది నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story