- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో బోల్తా.. మహిళ మృతి
దిశ, వెల్గటూర్ : ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన ఎండపల్లి మండలం సూరారం గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుపల్లి గ్రామానికి చెందిన ఇజ్జగిరి రాజేశ్వరి (42) (ఎపీ 20 టీఏ 0804) నెంబరు గల ఆటో ఎక్కి ధర్మారంలో పెళ్లి సామాన్లు కొనుగోలు చేసేందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఆటో సూరారం శివారులోకి రాగానే ఆటో డ్రైవర్ ఎదురుగా వస్తున్న బండారి రాజయ్య అనే వ్యక్తిని తప్పించే క్రమంలో సడన్ వేయడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న రాజేశ్వరి తీవ్రంగా గాయపడగా హుటాహుటిన పోలీసులు జగిత్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తన భార్య రాజేశ్వరి మృతి చెందిందని భర్త స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.