బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిపై కేసు నమోదు

by Kalyani |   ( Updated:2023-05-08 14:56:37.0  )
బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిపై కేసు నమోదు
X

దిశ, పరిగి: వరుసకు చిన్నాన్న అయే ఓ దుర్మార్గుడు కూతురిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామంలో జరిగింది. మంచన్ పల్లి గ్రామానికి చెందిన పి. రాజు వరుసకు తన అన్న కూతురైన 9 ఏళ్ల బాలికను మామిడికాయలు చెట్టుకు తెంపి ఇస్తానంటూ శనివారం పొలం వద్దకు తీసుకెళ్లాడు. మామిడికాయలు తెంపి ఇచ్చిన అనంతరం బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

ఇందుకు నిరాకరించిన బాలిక అరవడంతో రాజు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు అంటూ తిరిగి ఇంటి వద్ద వదిలేశాడు. బాలిక జరిగిన విషయం అంత కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబీకులు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడు రాజు పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్ఐ విటల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story