దారుణం.. వృద్ధురాలిని రాళ్లతో కొట్టి చంపి ఆమె మాంసం తిన్న యువకుడు

by Hamsa |
దారుణం.. వృద్ధురాలిని రాళ్లతో కొట్టి చంపి ఆమె మాంసం తిన్న యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కొంత మంది రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఇతరుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ కలకలం సృష్టిస్తున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో యువకుడు వృద్ధురాలిని చంపి ఆమె మాంసాన్ని తినేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ముంబైకి చెందిన సురేంద్రన్ ఠాకూర్ (24) హైడ్రోఫోబియాతో బాధపడుతున్నాడు. అయితే సురేంద్రన్ 65 ఏళ్ల శాంతి దేవి అనే వృద్ధురాలి పశువులను మేపడానికి వెళ్లగా ఆమెను రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మాంసాన్ని తిన్నాడు. వృద్ధురాలి కుమారుడు బిరాన్‌ కథోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో రభస సృష్టించడంతో నర్సులు అతడిని కట్టివేశారు. గతంలో అతడికి పిచ్చి కుక్క కరిచిన ఆ రోజు అతనికి తగిన చికిత్స అందకపోవడం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story