దారుణం.. మహిళను చంపి గుండెను బంగాళదుంపల్లో వేసి వండుకుని తిన్న వ్యక్తి..!

by Hamsa |   ( Updated:2023-03-18 10:02:24.0  )
దారుణం.. మహిళను చంపి గుండెను బంగాళదుంపల్లో వేసి వండుకుని తిన్న వ్యక్తి..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సమాజంలో చాలా దారుణ ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఇతరులపై కోపం పెంచుకుని వారిని అతి కిరాతంగా చంపేస్తున్నారు. మరికొంత మంది సైకోల్లా చంపేసిన వ్యక్తుల శరీర భాగాలను బయటకు తీస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలో లారెన్స్ పాల్ అనే వ్యక్తి ఒక మహిళను చంపి కిరాతంగా ఆమె గుండెను బయటకు తీసి కూర వండుకుని తిన్నాడు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలో లారెన్స్ పాల్ (44) అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. అయితే జైలు నుండి కోపంతో వచ్చిన బ్లాంకానె‌షిప్ అనే మహిళను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె గుండెను బయటకు తీసి తన అత్తమామల ఇంటికి తీసుకెళ్లాడు. మహిళ గుండెను ముక్కలు ముక్కలుగా కోసి అందులో బంగాళదుంపలు వేసి కూర వండాడు. ఆ వంటకాన్ని తన మామ, లియోన్ (67), ఆయన వాళ్ల 4 మనవరాలు కేయోస్‌కు వడ్డించాడు. అసలు విషయం తెలుసుకున్న వారు ఆ వంటకాన్ని తినడానికి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన లారెన్స్ వారిని కత్తితో పొడిచి చంపేశాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారెన్స్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఇటీవల నిందితుడిని కోర్ట్‌కు తీసుకెళ్లారు. లారెన్స్ నేరాల గురించి పరిశీలించిన కోర్ట్ అతడికి జీవిత ఖైదు శిక్ష విధించింది.

Read more:

బాత్రూమ్‌ ‘లో’ దుస్తుల హ్యాంగర్ చూపించిన నటి.

భారీ రెమ్యూనరేషన్ కోసం బెడ్ రూంలో బోల్డ్‌గా రెచ్చిపోయిన తమన్నా.. షాక్‌లో ఫ్యాన్స్

Advertisement

Next Story