ప్రతీకారం తీర్చుకునేందుకే ఆరీఫ్ డాన్ హత్య

by Shiva |   ( Updated:2023-06-05 14:43:45.0  )
ప్రతీకారం తీర్చుకునేందుకే ఆరీఫ్ డాన్ హత్య
X

ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... పరారీలో మరో ముగ్గురు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రౌడీ షీటర్ జంగల్ ఇబ్చు హత్యకు ప్రతీకారంగానే రౌడీ షీటర్ ఆరీఫ్ డాన్ హత్య జరిగినట్లు బోధన్ ఏసీపీ కే.ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ జూన్ 1న ఆరీఫ్ డాన్ హత్యకు పాల్పడిన నిందితుల్లో షేక్ సమదుద్దీన్ ఆలియాస్ సమద్ (హష్మీ కాలనీ,నిజామాబాద్), షేక్ ఇర్ఫాన్(ధర్మపురి హిల్స్ ,నిజామాబాద్), షేక్ రిజ్వాన్ (ధర్మపురి హిల్స్, నిజామాబాద్), సయ్యద్ అతీక్ ఆలియాస్ అట్టు (హష్మీ కాలనీ, నిజామాబాద్), షేక్ ఖరీం ఆలియాస్ లాలా (ధర్మపురి హిల్స్, నిజామాబాద్), షేక్ సోహేల్ ఆలియాస్ చత్రపతి లాల (ఆటోనగర్, నిజామాబాద్)లను అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్ బేగ్ ఆలియాస్ ఫిద్దు (నాగారం, నిజామాబాద్), సయ్యద్ సోహేల్ ఆలియాస్ చోటు సోహేల్ (బాబాన్ సాహెబ్ పహాడ్, నిజామాబాద్), ఇమ్రాన్ (దొడ్డు కొమురయ్య కాలనీ, నిజామాబాద్)లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సోమవారం పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఏ1 షేక్ సమదుద్దీన్ ఆలియాస్ సమద్ ను ఇంట్లో అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి స్వీఫ్ట్ కారు నంబర్. టీఎస్ 02 టీఎస్ 02ఎఫ్ఎఫ్ 1951, లారీ నంబర్ ఎపీ 07 టీయూ 9797 లను స్వాధీనం చేసుకున్నట్లు ఎసీపీ తెలిపారు.

జనవరి 1న షేక్ ఇబ్రహీం చౌస్ ఆలియాస్ జంగిల్ ఇబ్బును ఆరీఫ్ డాన్ గ్యాంగ్ హత్య చేయడంతో జంగిల్ ఇబ్బు బంధువులు షేక్ ఇర్ఫాన్, షేక్ సోహేల్ కలిసి ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం రూపొందించారని తెలిపారు. ఆరీఫ్ డాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత గత ఐదు నెలల క్రితం నుంచి చంపేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా జూన్ 1న బోధన్ కోర్టులో ఫేసీ ఉందని తెలుసుకుని షేక్ కరీం ఆలియాస్ లాల, షేక్ సోహెల్ లు బోధన్ నుంచి నిజామాబాద్ కు బుల్లెట్ బైక్ వెళ్తుండగా ఆరీఫ్ డాన్ ను లారీతో ఢీకొట్టారు.

వెంటనే మారుతి స్వీఫ్ట్ కారులో సమదుద్దీన్, ఇర్ఫాన్, రిజ్వాన్, అతీక్, సోహైల్ ఆలియాస్ చోటు, ఫిద్దులు కత్తులతో ఆరీఫ్ డాన్ తల ఎడమ వైపు, చాతి, కడుపు పలు చోట్ల 20 కత్తిపోట్లు పొడవగా తీవ్ర రక్తస్రావం కావడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు. ఆరీఫ్ డాన్ హత్య కేసును చేధించిన బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్, బోధన్ రూరల్ ఎస్సై సందీప్, ఎడపల్లి ఎస్సై పాండేరావును అభినందించారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ కే.ఎం కిరణ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed