- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గోడౌన్ నుండి ఎగసిపడుతోన్న మంటలు
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోడౌన్‌లో ఆదివారం ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గోడౌన్ నుండి అగ్ని జ్వాలలు భారీగా ఎగసి పడటంతో ఆందోళన చెందిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సహయంతో పెద్దఎత్తున ఎగసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. కాగా, ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story