తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం

by Javid Pasha |
తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం
X

దిశ, ఆళ్ళగడ్డ: ఆళ్లగడ్డ నియోజవర్గంలోని రుద్రవరం మండలం అప్పనపల్లి గ్రామ ఫారెస్ట్ సమీపంలోని తెలుగు గంగ 19వ బ్లాక్ కాలువలో గుర్తుతెలియని శవం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న రుద్రవరం ఎస్ఐ నిరంజన్ రెడ్డి పురుషుడి మృతదేహాన్ని వెలికి తీశారు. చనిపోయింది ఎవరు, మృతదేహం ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed