గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, మల్యాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు ప్రాంతంలోని రైల్వే ట్రాక్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొండగట్టు వైపు వెళ్తున్న జగిత్యాల రైల్వే ట్రాక్ మెయిన్ ఇచ్చిన సమాచారం మేరకు.. రైల్వే ట్రాక్ పక్కే నడుం భాగం నుంచి కాళ్ల వరకు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించామని మంచిర్యాల రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే జగిత్యాల ప్రభుత్వ వైద్యుడితో పోస్ట్ మార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ పాయింట్ వేసుకుని ఉన్నట్లు, నడుం భాగం నుండి కాళ్ల వరకు కుళ్ళిపోయి తల మరియు చాతి భాగం ఘటనా స్థలంలో లభించలేదని తెలిపారు. కేవలం నడుము కింది భాగము మాత్రమే గుర్తించినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే మంచిర్యాల రైల్వే పోలీస్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story