పని మనిషితో బెడ్‌పై రెచ్చిపోయిన వృద్ధుడు.. శృంగారం చివరి క్షణంలో..

by sudharani |   ( Updated:2022-11-26 14:55:53.0  )
పని మనిషితో బెడ్‌పై రెచ్చిపోయిన వృద్ధుడు.. శృంగారం చివరి క్షణంలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : 67 ఏళ్ల వయసులో మన్మథుడిలా మారిన ఓ వృద్ధుడు 35 ఏళ్ల పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కానీ శృంగారం పూర్తి కాకుండానే ప్రియురాలిపై పడి తుదిశ్వాస వదిలాడు. అయితే అతడి మృతిపై ఎన్నో అనుమానాలు వచ్చాయి.. శృంగారం చేయలేక చనిపోయాడా..? లేక పని మనిషే కాటేసిందా..? అని పుకార్లు లేచాయి. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు ఈ డెత్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

బెంగళూరులోని జేపీనగర్ పుట్టెనహళ్లికి చెందిన బాలసుబ్రమణ్యం (67) నగరంలో వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. వృద్ధాప్యంలో ఉన్న అతడికి పడక సుఖం వైపు మనసు మళ్లీంది. దీంతో అతడి దృష్టి ఇంట్లో పనిచేసే మహిళ(35)పై పడింది. ఆమె సైతం ఓనర్ కోరికను కాదనలేక పోయింది. దీంతో కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలిసినా అతడు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 16న బాలసుబ్రమణ్యం హఠత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వృద్ధుడి ఆచూకీ కోసం వెతకగా.. సిటీకి దూరంగా నిర్మాణుష్య ప్రాంతంలో ఓ ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహం లభ్యం అయింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంట్లో వాళ్లగాను విచారించగా.. పని మనిషితో ఉన్న అక్రమ సంబంధం గురించి వెల్లడించారు.

పోలీసులు ఆ 35 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడించింది. కొన్నాళ్లుగా బాలసుబ్రమణ్యంతో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపింది. అయితే ఎప్పటి మాదిరిగానే ఈ నెల 16న తామిద్దరం బెడ్ రూంలో శృంగారంలో పాల్గొన్నామని.. చివరి క్షణంలో అతడు ఒక్కసారిగా తనపై పడిపోయాడని.. ఎంతలేపినా లేవకపోవడంతో పరీక్షించగా.. మృతి చెందాడని తెలిపింది. అయితే అతడి మరణం తనపైకి వస్తుందనే భయంతో తన భర్తకు, బంధువుకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని సిటీకి దూరంగా పడేసినట్లు ఒప్పుకుంది. ఈలోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనూ బాలసుబ్రమణ్యంది సహజ మరణం అని తేలింది. అయితే వృద్ధుడికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని, గతేడాది యాంజియో ప్లాస్టీ కూడా చేయించుకున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇలా పని మనిషితో చేసిన శృంగార కార్యం అతడిని 'స్వర్గం' అంచుల వరకు తీసుకెళ్లింది.

READ MORE

భార్య అర్ధరాత్రి వరకు మరిదితో అదే పనిలో బిజీ.. భర్త చూడటంతో..

Advertisement

Next Story