భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

by Mahesh |   ( Updated:2023-04-30 04:58:13.0  )
భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
X

దిశ, అలంపూర్/ఇటిక్యాల: చెడు వ్యసనాలకు బానిస అయిన భార్య శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమె భర్తను గొడ్డలితో హతమార్చిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మొగలి రావుల చెరువు గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మంద దేవరాజు (35), అలివేలు గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని వారి స్వగ్రామంలో నివాసం ఉంటున్నారు.

కొన్ని సమయాలలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లేవారు అని తెలిసింది. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇరువురు మద్యానికి, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు. పలు సందర్భాలలో భార్యాభర్తలు గొడవలు పడే వారిని కలిసింది. శనివారం రాత్రి భర్తకు మద్యం ఎక్కువగా త్రాగించి అతను నిద్రలోకి జారుకున్న తర్వాత అలివేలు గొడ్డలితో నరికి చంపినట్లు హతమార్చింది.

ఎవరికైనా చెబితే చంపేస్తామని వారి కూతురు, కుమారుడిని హెచ్చరించడంతో వారు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. చివరికి విషయం తెలిసిపోతుంది అని మా నాన్న తలను గోడకు బాదుకొని మరణించాడు అని బంధువులకు చెప్పి రమ్మని అదే రాత్రి పంపింది. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకోగా రక్తపు మడుగులో పడి ఉండడానికి గుర్తించి ఏం జరిగింది అని గట్టిగా నిలదీయడంతో అలివేలు తానే గొడ్డలితో హతమార్చినట్లు చెప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై గోకారి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం జోగులాంబ గద్వాల జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story