arrest : చోరీ కేసులో నిందితులు అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2024-11-05 12:02:13.0  )
arrest : చోరీ కేసులో నిందితులు అరెస్ట్
X

దిశ, గుండాల : చోరీ కేసులో పోలీసులు నిందితులని అరెస్ట్ చేశారు. గత నెల 30వ తేదీన గుండాలలోని మణికంఠ జ్యువెలరీ షాపు లో దొంగతనం జరిగింది. ఇందులో నలుగురు నిందితులు పాల్గొనగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విజయవాడకు చెందిన మలపోలు శివ నాగ మహేష్, బొమ్మిడి సాయి కుమార్, కాకినాడ శ్రీనివాసాచారిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజమౌళి, సిబ్బందిని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మంగయ్య, చీమల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రవీణ్, శంకర్, గోపి పాల్గొన్నారు.

Advertisement

Next Story