ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

by Shiva |   ( Updated:2023-05-18 13:58:56.0  )
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
X

దిశ, కొండపాక : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అరెపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కూకూనూర్ పల్లి ఎస్సై పుష్పరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన లడే నర్సింగరావు(50) తన ట్రాక్టర్ తో పొలం వద్ద ఉన్న హార్వెస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే పొలం వరంపై నుంచి ట్రాక్టర్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టాక్టర్ నడుపుతున్న నర్సింగరావు టాక్టర్ కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజు తెలిపారు.

Advertisement

Next Story