Accident : ఆర్టీసీ బస్సు టైర్ల కిందపడి వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
Accident : ఆర్టీసీ బస్సు టైర్ల కిందపడి వ్యక్తి దుర్మరణం
X

దిశ, శామీర్ పేట : ఆర్టీసీ బస్సును ఓవర్​ టేక్​ చేయబోయి డివైడర్​ను ఢీకొట్టి వ్యక్తి మృతి (The person died)చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ (Sameer Peta Police Station)పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కార్ఖానాగడ్డ కు చెందిన షేక్ సక్లిన్, అతని స్నేహితుడు మహమ్మద్ పుర్కన్ కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుంచి మెహిదీపట్నంకు వెళ్తున్నారు.

మార్గమధ్యలో శామీర్ పేట ఓఆర్ఆర్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్​ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో సక్లిన్ (Saklin)తనకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల కూర్చున్న పుర్కన్ కు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story