ACB : ఇంటి నెంబర్​కు రూ.20 వేలు లంచం...అడ్డంగా దొరికిన కార్యదర్శి

by Sridhar Babu |
ACB : ఇంటి నెంబర్​కు రూ.20 వేలు లంచం...అడ్డంగా దొరికిన కార్యదర్శి
X

దిశ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామపంచాయతీ సెక్రటరీ పుల్లయ్య మంగళవారం ఏసీబీకి పట్టుపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రేగళ్ల పంచాయతీలో నివాసముంటున్న లక్ష్మ అనే వ్యక్తి కొత్త ఇంటికి నెంబర్ కావాలని సెక్రటరీ పుల్లయ్యను సంప్రదించాడు. దాంతో ఆయన రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు.

చివరికి రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ పక్కా ప్రణాళికతో సెక్రటరీ పుల్లయ్యను పట్టుకున్నారు. కాగా డబ్బులు బదిలీ కాలేదని, ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా పుల్లయ్యను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.

Advertisement

Next Story