ఐదో అంతస్థు నుంచి జారిపడి యువతి మృతి

by Javid Pasha |
ఐదో అంతస్థు నుంచి జారిపడి యువతి మృతి
X

దిశ, నెల్లూరు: ఐదో అంతస్థు బాల్కనీ గోడపై కూర్చొని మ్యూజిక్‌ ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన జయభార హాస్పిటల్‌ సమీపంలోని డీఆర్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డీఆర్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతుస్థులో టి.సుబ్బరామ, కామాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆయన అనితా థియేటర్‌ సమీపంలో స్పేర్‌ పార్ట్స్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన రెండో కుమార్తె శివాణి(23) ఇంటర్‌పూర్తి చేసి ఇటీవల నీట్‌ ఎగ్జామ్స్‌ రాసింది. సోమవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతలో శివాణి తలస్నానం చేసింది. బాల్కనీ గోడపై కూర్చొని ఫోన్లో మ్యూజిక్‌ వింటూ తలను ఆరబెట్టుకుంటుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడింది. వెంటనే అక్కడున్న వారు ఆమెను చికిత్స నిమిత్తం తొలుత జయభారత్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అంతట మెరుగైన వైద్యంకోసం అపోలో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో శివాణి మృతి చెందింది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story