విషాదంగా ముగిసిన బాలుడి కిడ్నాప్ కథ.. హోటల్‌కి వెళ్తున్నానని చెప్పి..

by Satheesh |
విషాదంగా ముగిసిన బాలుడి కిడ్నాప్ కథ.. హోటల్‌కి వెళ్తున్నానని చెప్పి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో బాలుడి కిడ్నాప్ కథ విషాదంగా ముగిసింది. ఈ నెల 12వ తేదీన కిడ్నాప్‌కు గురైన ఫైసల్ అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఫైసల్ ఈ నెల 12వ తేదీన ఇంటి నుండి బయటికెళ్లాడు. ఉస్మానియా హోటల్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఫైసల్.. దాదాపు వారం రోజులు గడిచిన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే.. నిన్న రాత్రి ఫైసల్ దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story